Entertainment Silverscreen Articles 0709 28 1070928012_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్సీ చూపుల అనుష్క బిజీబిజీ

Advertiesment
గ్లామర్ హీరోయిన్ సెక్సీతార అనుష్క వరుస ఆఫర్లు
హైదరాబాద్ (ఏజెన్సీ) , శుక్రవారం, 28 సెప్టెంబరు 2007 (14:25 IST)
WD PhotoWD
'విక్రమార్కుడు'తో తెలుగు ప్రేక్షకలోకంలో మార్కులు కొట్టేసిన గ్లామర్ హీరోయిన్ అనుష్క టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా పలు చిత్రాలకు అనుష్క తన అంగీకారం తెలిపినట్లు టాలీవుడ్ న్యూస్. సురేష్ ప్రొడక్షన్స్ రవితేజతో ఓ చిత్రం నిర్మించనున్నదని, అందులో అనుష్క కథానాయికగా నటించనుందని టాలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి.

అదేవిధంగా మరో అగ్రదర్శకుడు దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ అనుష్క నటించనున్నట్లు వార్త. మరోవైపు బాలకృష్ణ 'ఒక్కమగాడు', నాగార్జున 'డాన్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మొత్తం మీద టాలీవుడ్ అనుష్కకు ఛాన్సుల వర్షం కురిపిస్తోంది. అయితే ఇదంతా ప్రేక్షకుల చలవేనంటోంది సెక్సీతార అనుష్క.

Share this Story:

Follow Webdunia telugu