Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్ర రాజధానిలో మెగాస్టార్ 53వ జన్మదిన వేడుకలు

రాష్ట్ర రాజధానిలో మెగాస్టార్ 53వ జన్మదిన వేడుకలు
, మంగళవారం, 4 సెప్టెంబరు 2007 (12:47 IST)
ఆంధ్రుల అభిమాన నటుడు, మెగాస్టార్ చిరంజీవి 53వ జన్మదిన వేడుకలు బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగాయి. అత్యవసర పనిమీద చిరంజీవి లండన్‌కు వెళ్లడంతో బర్త్‌డే వేడుకలు ఆయన కుటుంబసభ్యుల సమక్షంలో జరిగాయి. ఇక్కడి శిల్పకళా వేదిక వద్ద జరిగిన ఈ వేడుకల్లో హీరో పపన్ కళ్యాణ్, నాగబాబుతో పాటు.. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. తన బర్త్‌డే సందర్భంగా అభిమానులకు చిరంజీవి ఓ సందేశాన్ని లండన్‌ నుంచి పంపించారు.

ఈ సందర్భంగా కేక్‌ను కట్‌ చేసిన హీరో పవన్ కళ్యాణ్.. ఎక్కువసార్లు రక్తదానం చేసిన అభిమానులకు షీల్డ్స్‌ను బహుకరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. అన్నయ్య చిరంజీవి గొప్ప నటుడు మాత్రమే కాదని, మంచి మానవత్వ విలువలు కలిగిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన జీవితాన్ని ఈ సమాజ సేవ కోసం అంకితం చేశారని పవన్ కొనియాడారు.

అనంతరం చిరంజీవి ఓ క్యాసెట్‌లో రికార్టు చేసిన సందేశంలో.. ఈ పుట్టినరోజు సందర్భంగా తనను అభినందిస్తున్నవారందికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ అరుదైన సమయంలో అభిమానుల ముందు లేకయినప్పటికీ.. అభిమానులు చేస్తున్న సమాజ సేవ తనకు ఎంతగానో సంతృప్తినిస్తున్నాయనీ, రక్తదానం, నేత్రదానం వంటి బృహత్తర కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఇకముందు కూడా ఈ సేవను కొనసాగించేందుకు అందరి సహాయసహకారాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు చిరంజీవి తన సందేశంలో కోరారు. అయితే.. ఈ వేడుకలకు ఆయన తనయుడు రామ్‌చరణ్ తేజ్ హాజరుకాక పోవడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu