Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలుత స్నేహం.. తేడావస్తే సమర శంఖమే : పాక్‌పై అణుదాడికి రెఢీ

దాయాది దేశం పాకిస్థాన్‌తో పాటు ఇతర పొరుగు దేశాలతో వాజ్‌పేయి చెలిమి కోసం ఎంతగానో ప్రయత్నించారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌ పట్ల ఆయన మరింత శ్రద్ధచూపారు. పాకిస్థాన్‌తో నిరంతరం శాంతిని కోరుకున్న వాజ్‌పేయి... ద

Advertiesment
AB Vajpayee
, శుక్రవారం, 17 ఆగస్టు 2018 (10:33 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌తో పాటు ఇతర పొరుగు దేశాలతో వాజ్‌పేయి చెలిమి కోసం ఎంతగానో ప్రయత్నించారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌ పట్ల ఆయన మరింత శ్రద్ధచూపారు. పాకిస్థాన్‌తో నిరంతరం శాంతిని కోరుకున్న వాజ్‌పేయి... దాయాది దేశం కార్గిల్ యుద్ధానికి పాల్పడటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. తొలుత సైనిక చర్యకు దిగిన ఆయన.. అవసరమైతే అణ్వస్త్ర దాడికి కూడా భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు సంకేతాలు పంపారు.
 
దీంతో క్లింటన్‌ ఆనాటి అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఆంథోనీ జిన్నీని నాటి పాక్‌ ఆర్మీ చీఫ్‌ ముషారఫ్‌ వద్దకు పంపారు. ఆయనతో ముషారఫ్‌ కాశ్మీరు అంశం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించగా 'నేను కార్గిల్‌ గురించి మాట్లాడేందుకు వచ్చాను, కాశ్మీరు గురించి కాదు. మీరు వెంటనే కార్గిల్‌ నుంచి వైదొలగకపోతే యుద్ధాన్ని, అణు విధ్వంసాన్ని చేజేతులా కొనితెచ్చుకున్నట్లే అవుతుంది' అని ఆయనను జిన్నీ హెచ్చరించారు. దీంతో పాక్‌ సేనలు కార్గిల్‌ నుంచి వైదొలగక తప్పలేదు. 
 
అంతేకాకుండా, భారత ప్రధానిగా వాజ్‌పేయి ఉన్న రోజుల్లో భద్రతాపరంగా దేశం పలు సవాళ్లను ఎదుర్కొంది. కార్గిల్ యుద్ధంతో పాటు కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటి నుంచి దేశాన్ని సురక్షితంగా బయటపడేయగలిగారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

65 ఏళ్ల స్నేహం.. స్కూటర్‌లో తిరిగేవాళ్లం.. పానీపూరీ తినేవాళ్లం.. అద్వానీ ఆవేదన