Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగ్లండ్ గడ్డపై ఘోర వైఫల్యం.. రవిశాస్త్రి, కోహ్లీలపై కన్నేసిన బీసీసీఐ

ఇంగ్లండ్ గడ్డపై భారత్ పరాజయం పాలవడంపై భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యంపై.. కెప్టెన్ విరాట్ కొహ్లీ,కోచ్ రవిశాస్త్రిలను బీసిసిఐ ప్రశ

ఇంగ్లండ్ గడ్డపై ఘోర వైఫల్యం.. రవిశాస్త్రి, కోహ్లీలపై కన్నేసిన బీసీసీఐ
, బుధవారం, 15 ఆగస్టు 2018 (11:25 IST)
ఇంగ్లండ్ గడ్డపై భారత్ పరాజయం పాలవడంపై భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యంపై.. కెప్టెన్ విరాట్ కొహ్లీ, కోచ్ రవిశాస్త్రిలను బీసిసిఐ ప్రశ్నించనుంది.తుది జట్టును ఎంపిక చేయడంలో విరాట్, రవిశాస్త్రి కలిసి తీసుకున్న నిర్ణయాలపై బోర్డ్ ఆరా తీయనుంది. జట్టు సెలక్షన్‌తో పాటు తుది జట్టు ఎంపికలో రవిశాస్త్రి, విరాట్ కొహ్లీలకు బీసిసిఐ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 
 
ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బీసిసిఐ విరాట్, రవిశాస్త్రిల సలహాలను పరిగణలోకి తీసుకుని పటిష్టమైన జట్టునే ఎంపిక చేసింది. టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా టీ20, వన్డే సిరీస్‌లతో పాటు వామప్ మ్యాచ్‌లు సైతం ఏర్పాటు చేసింది. టీ20 సిరీస్ నెగ్గి, వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల్లో తేలిపోయింది. 
 
ప్రస్తుత టెస్ట్‌ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు జట్టులో మార్పులు చేసిన భారత్ పెద్ద మూల్యాన్నే చెల్లించింది. అందుకే కెప్టెన్ విరాట్, రవిశాస్త్రిల నిర్ణయాలపై బీసిసిఐ నిఘా పెట్టింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం తొలి 3 టెస్ట్‌లకు మాత్రమే భారత జట్టును ఎంపిక చేసిన బీసిసిఐ ఆఖరి రెండు టెస్ట్‌లకు జట్టును ప్రకటించాల్సి ఉంది. విరాట్, రవిశాస్త్రిలను సంప్రదించిన తర్వాతే చివరి రెండు టెస్ట్‌లకు జట్టును ఎంపిక చేయనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముర‌ళీ విజ‌య్.. ఎప్పుడు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్నావు : నెటిజన్స్ ట్రోలింగ్