Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరగబడుతున్న అమెరికా కల, అక్కడున్న విద్యార్థికి నెలకి లక్ష పంపాల్సొస్తోంది

Advertiesment
The American dream reversed

ఐవీఆర్

, శుక్రవారం, 31 జనవరి 2025 (17:04 IST)
ఫోటో కర్టెసి: Freepik
తాజాగా అమెరికా పీఠాన్ని అధిష్టించిన డోనాల్డ్ ట్రంప్ విధానాలతో అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు దారుణ పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇదివరకు ఎంఎస్ చదువుకునేందుకు వెళ్లి, క్యాంపస్ చదువులు చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ అక్కడే నిలదొక్కుకునేవారు. ఈ సమయంలో తమ ఖర్చులకు పోను ఇంటికి కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పంపేవారు. అలాంటిది పరిస్థితి తిరగబడిపోయింది.

ట్రంప్ తీసుకువచ్చిన విధానాల వల్ల చదువుతూ బైట పార్ట్ టైం చేసే అవకాశం లేదు. అలా చేస్తే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా వారు దేశంలోకి అక్రమంగా తరలి వచ్చారని ఇక శాశ్వతంగా అమెరికాలోనికి ప్రవేశించకుండా చేసేస్తారు. దీనితో చాలామంది విద్యార్థులు భయపడిపోయి పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. దీనితో వారి నెలవారీ ఖర్చులకు భారతదేశంలో తమ తల్లిదండ్రులను అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రకారంగా వారికి నెలకి కనీసం 70 నుంచి లక్ష రూపాయల వరకూ ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.
 
అమెరికా వదిలేసి రమ్మంటే ఏడుస్తున్నారు
ఈ పరిస్థితిని గమనించి కొంతమంది తల్లిదండ్రులు ఇక అమెరికాలో వున్నది చాలు... వచ్చేయమంటుంటే అక్కడ జీవనానికి అలవాటు పడిని యువతీయువకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా ఇక్కడే సాధిస్తామంటూ నచ్చచెబుతున్నారు. కానీ తమ బిడ్డల పరిస్థితి చూస్తుంటే తమకు ఆందోళనగా వుందని చెబుతున్నారు తల్లిదండ్రులు.
 
ఊళ్లోవాళ్లకి నీ ముఖం ఎలా చూపిస్తావ్ నాన్నా...
తన బిడ్డను రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం సంపాదిస్తానంటే పంపాను, కానీ ఇప్పుడు వాడికి ఉద్యోగం లేదు. ఏదో షాపులో చేస్తున్నాడట... పట్టుకుంటే వీసా క్యాన్సిల్ చేస్తారని చదివి... అమెరికా నుంచి వచ్చేయిరా అని అంటుంటే, ఊళ్లో వాళ్లకి నీ ముఖం ఎలా చూపిస్తావు నాన్నా అంటున్నాడని ఓ క్యాబ్ డ్రైవర్ చెబుతున్నారు. ఇలా అమెరికాలో చదువులు కోసం, ఉద్యోగాల కోసం తమ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతంగా వుంది.

ఐతే ఏప్రియల్ నెల తర్వాత నుంచి పరిస్థితుల్లో కాస్త మార్పు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. కానీ మార్పు వస్తుందే లేదో కానీ ఈలోపుగా అక్కడి విదేశీ విద్యార్థినీవిద్యార్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్