Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరిశుభ్రతకు కొత్త గుర్తింపు - "స్వచ్ఛ భారత్ అభియాన్"

Advertiesment
pmmodi
, సోమవారం, 6 జూన్ 2022 (15:31 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టి వాటిని పక్కాగా అమలు చేసేందుకు నడుంబిగించారు. సాక్షాత్ దేశ ప్రధానే చీపురును చేతబట్టి వీధులు ఊడ్చారు. దీన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా పాటించేలా, అనుసరించేలా చేసేందుకు "స్వచ్ఛ భారత్ అభియాన్" పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. ఇది దేశానికి కొత్త గుర్తింపు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జనశక్తిగా మారింది. 
 
* ముఖ్యంగా పరిశుభ్రత అనేది నేడు జాతీయ లక్షణంగా రూపుదిద్దుకుంది. ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ చెత్త రహిత భారతదేశం కోసం కృషి చేస్తున్నారు. 
 
* బహింరగ మలమూత్ర విసర్జన రహితంగా అన్ని గ్రామాలు, నగరాలు మారుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 11.5 కోట్లకు పైగా ఇళ్ళలో మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా గౌరవప్రదమైన జీవితానికి భరోసా ఇచ్చింది. 
 
* ఓడీఎఫ్ ప్లస్‌గా మారిన 58 వేలకు పైగా గ్రామాలు, 3300పైగా నగరాలు. 
 
* గ్రామాలు, నగరాల్లో 8.2 లక్షలకు పైగా సామాజిక సౌచాలయ సముదాయాల నిర్మాణం ద్వారా ప్రతి చోటా ఓ మరుగుదొడ్డి లభ్యతకు ఈ పథకం భరోసా కల్పించింది. 
 
* పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాలను పారవేయడంతో నాలుగు రెట్లు పెరుగుదల కనిపించింది. 2013-14లో రోజుకు 26 వేల టన్నుల చెత్త ఉండగా ఇది 2021-22 నాటికి లక్షల టన్నులకు చేరింది. 
 
* 2.5 లక్షల చెత్త సేకరణ వాహనాల ద్వారా 87 వేల అర్బన్ వార్డుల్లో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
 
* ఆవు పేడ తొలగింపు, పూర్తిగా పునర్వినియోగం కోసం గోబర్డాన్ యోజన కింద 232 జిల్లాల్లో 350కి పైగా బయోగ్యాస్ ప్లాంట్ల నిర్వహణ వ్యర్థాలన నుంచి సంపదకు అత్యుత్తమ ఉదాహరణ. 
 
* సుజలం అభియాన్ కింద గ్రే వాటర్ మేనేజ్‌మెంట్ కోసం పది లక్షల సామాజిక గృహ ఇంకుడు గుంతల నిర్మాణం. 1.4 లక్షల గ్రామాల్లో మెరుగైన నీటి యాజమాన్యం.
 
* సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తొలగింపు, పునర్వినియోగం కోసం దేశ వ్యాప్తంగా ప్రజా ప్రచార కార్యక్రమం. 
 
* చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల పరిరక్షణ పరిశుభ్రతపై "ప్రత్యేక దృష్టి-39" వారసత్వ ప్రదేశాల పరిశుభ్రత, నిర్వహణ ప్రమాణఆలలో మెరుగుదల. 
 
* సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించి, సామూహిక అవగాహన భాగస్వామ్యాన్ని సృష్టించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్‌పై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరణ. 
 
* ఈ స్వచ్ఛ భారత్ అభియాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశంలో... "ఇప్పటివరకు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రయాణం ప్రతి దేశస్థుడు గర్వపడేలా చేసంది. స్వచ్ఛ భారత్ అభియాన్ ఒక లక్ష్యం, దేశ గౌరవం ఆకాంక్షలు, మాతృభూమి పట్ల ప్రేమను నింపుకొని వుంది. దీని విజయం వెనుక ప్రతి పౌరుడు సహకారం, కృషి పరిశ్రమ ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో విషాదకర ఘటన: దంపతులపై ఎలుగుబంటి దాడి