Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిజెపికి కుడి చేయి వైసిపి... ఎడమ చేయి జనసేన... ఇక ఏపీలో తిరుగేముంటుందీ?

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులే ముక్కుపైన వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఒక్కసారిగా టిడిపిపై విరుచుకుపడి.. బిజెపి పైన, వైసిపి పైన పెద్దగా విమర్శలు చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపి

Advertiesment
బిజెపికి కుడి చేయి వైసిపి... ఎడమ చేయి జనసేన... ఇక ఏపీలో తిరుగేముంటుందీ?
, గురువారం, 15 మార్చి 2018 (15:57 IST)
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులే ముక్కుపైన వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఒక్కసారిగా టిడిపిపై విరుచుకుపడి.. బిజెపి పైన, వైసిపి పైన పెద్దగా విమర్శలు చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా జనసేన ఖచ్చితంగా టిడిపితోనే కలిసిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులందరూ చర్చాగోష్టిలో చెబుతూ వచ్చారు. కానీ అదంతా రివర్సయ్యింది. టిడిపిపై అలాంటి.. ఇలాంటి వ్యాఖ్యలు కాదు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబే దిమ్మతిరిగే ఆరోపణలు చేశారు జనసేనాని. 
 
దీంతో ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒకటే చెబుతున్నారు. భారతీయ జనతాపార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుడి చేయి.. జనసేన పార్టీ ఎడమచేయి అని చెబుతున్నారు. నిన్న గంటన్నరకు పైగా సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్‌ కేంద్రాన్ని చూస్తే భయం లేదని మాత్రమే చెప్పారు. అంతేగానీ బిజెపిని అస్సలు విమర్శించలేదు. వైసిపిని కూడా ముట్టీముట్టనట్లు రెండు పదాలతో విమర్శలు చేసి మమ అనిపించేశారు. దీంతో ఇదంతా కేంద్ర నాయకుల డైరెక్షన్ అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
ఇదే నిజమైతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లోపు వైసిపి, జనసేనలు రెండూ కలిసిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. బిజెపి సపోర్ట్‌తో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు బరిలో నిలుస్తాయని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదే నిజమని స్పష్టంగా అర్థమవుతోంది. బిజెపి లాంటి జాతీయ పార్టీతో కలిసి ఉంటే ఖచ్చితంగా జనసేనకు బాగా కలిసొస్తుందన్న నమ్మకంలో పవన్ కళ్యాణ్‌ ఉన్నట్లు మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోరఖ్‌పూర్‌లో బీజేపీని ఓడించిన తెలుగు ఓటర్లు.. ఇక కర్ణాటకపై దృష్టి...