Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది.. కమలనాథులు నివ్వెరపోయారు

భారతీయ జనతా పార్టీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది. దీంతో కమలనాథులు నివ్వెరపోయారు. గత మూడు దశాబ్దాలుగా కమలనాథుల చేతుల్లో ఉన్న ఈ లోక్‌సభ స్థానం ఇపుడు సమాజ్‌వాదీ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

Advertiesment
బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది.. కమలనాథులు నివ్వెరపోయారు
, గురువారం, 15 మార్చి 2018 (12:00 IST)
భారతీయ జనతా పార్టీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది. దీంతో కమలనాథులు నివ్వెరపోయారు. గత మూడు దశాబ్దాలుగా కమలనాథుల చేతుల్లో ఉన్న ఈ లోక్‌సభ స్థానం ఇపుడు సమాజ్‌వాదీ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీన్ని కమలనాథులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఫలితంగా ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలోపడ్డారు. 
 
ఈ స్థానం చరిత్రను ఓసారి పరిశీలిస్తే, గోరఖ్‌పూర్‌ లోక్‌స స్థానం. గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి మహంత అవైద్యనాథ్‌ వరుసగా మూడుసార్లు ఇక్కడ గెలిచారు. ఆయన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఈయన వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. అంటే, దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీదే ఆధిపత్యం. గత ఎన్నికల్లోనూ అంతకుముందు ఎన్నికల్లో కూడా యోగి ఏకంగా 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయన యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. దీంతో యోగి రాజీనామా చేయడంతోనే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. 
 
గత ఎన్నికల్లో అయితే, యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఏకంగా 73 గెలుచుకుంది. దాంతో, గోరఖ్‌పూర్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై బండి నడకే అనుకున్నారంతా! యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోటలో ఇతర పార్టీలు అడుగు పెట్టడం అసాధ్యమని భావించారు. కానీ, ఆ కంచుకోట బద్దలైంది. గోరఖ్‌పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌ సంచలన విజయం సాధించారు. 
 
బీజేపీ దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో, బీజేపీ అగ్ర నేతలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, రాజకీయ పండితులు కూడా నివ్వెరపోయారు. గోరఖ్‌పూర్‌ పార్లమెంటు స్థానం బీజేపీ కంటే కూడా గోరఖ్‌నాథ్‌ మఠానికి చెందినది. మూడు దశాబ్దాలుగా మఠానికి చెందిన వ్యక్తులే ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఇపుడు ఆ స్థానం ఓటర్లు చరిత్రను తిరగరాశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ బడ్జెట్ 2018-19: వ్యవసాయానికి పెద్దపీట.. పెట్టుబ‌డి ప‌థ‌కం కోసం రూ.12వేల కోట్లు