Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరంగల్‍లో ఓ కీచక బాబా నిర్వాహకం.. పూజల పేరుతో అత్యాచారం

Advertiesment
arrest
, బుధవారం, 14 జూన్ 2023 (08:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఓ కీచక బాబా వెలుగులోకి వచ్చాడు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల తగాదాలు, ఆరోగ్య సమస్యలు తీర్చుతానంటూ స్థానికులను నమ్మించి, ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. తాజాగా పూజల పేరుతో ఓ మహిళను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. కీచక బాబా కటకటాల వెనక్కి వెళ్లాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షైక్నాలో లేబ్బే అనే వ్యక్తి నాలుగు దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. తనకు మంత్రశక్తులు ఉన్నాయని స్థానిక ప్రజలను నమ్మించాడు. ప్రత్యేకంగా పూజలు చేసి, తాయెత్తులు కట్టడం ద్వారా కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, అనారోగ్య సమస్యలు పరిష్కరిస్తారంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనను ఆశ్రయించిన పలువురు యువతులు, వివాహితలకు డబ్బు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడసాగేవాడు. 
 
ఇటీవల ఓ మహిళపై కన్నేసి, ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు నటించిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు, టాస్క్‌‍ఫోర్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి వద్దకు ఓ మహిళను పంపారు. పూజల పేరుతో ఆమెతో వెకిలి చేష్టలు చేస్తుండగా కీచక బాబాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీచక బాబా నుంచి ఎర్రదారాలు, నల్లదారాలు, తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వనమూలికలు, నూనె డబ్బాలతో పాటు రూ.25 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాలో విషాదం.. పడవ మునిగి 100 మంది జలసమాధి