Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నా: బెంగళూరులో టెక్కీ 24 పేజీల నోట్

suicide

ఐవీఆర్

, బుధవారం, 11 డిశెంబరు 2024 (13:27 IST)
తన భార్య వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న అతుల్‌ సుభాష్‌ తన భార్య, ఆమె బంధువులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ 24 పేజీల సూసైడ్‌ నోట్‌ ద్వారా తెలియజేసాడు. చట్టాలు మహిళలకు అనుకూలంగా వున్నాయనీ, పురుషులకు లేవంటూ ఆవేదన వ్యక్తం చేసాడు.
 
సుభాష్ వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నాడని, అతని భార్య ఉత్తరప్రదేశ్‌లో అతనిపై కేసు పెట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతడు ఆత్మహత్య చేసుకునే ముందు ఈ విషయాన్ని తన స్నేహితులతో ఇ-మెయిల్ ద్వారా పంచుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుభాష్ తన ఇంట్లో “న్యాయం జరగాలి” అని రాసి ఉన్న ప్లకార్డును వేలాడదీశాడు. తన డెత్ నోట్‌తో పాటుగా వాహనం తాళాలు, పూర్తి చేసిన పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల జాబితాతో సహా ముఖ్యమైన వివరాలను అల్మారాపై అతికించాడని పోలీసులు తెలిపారు.
 
నా భార్య నాపై తొమ్మిది కేసులు నమోదు చేసింది. ఆరు కేసులు దిగువ కోర్టులోనూ, మూడు హైకోర్టులో ఉన్నాయని శర్మ సూసైడ్ చేసుకునే ముందు రికార్డ్ చేసిన వీడియోలో చెప్పారు. తనపై, తన తల్లిదండ్రులు, తన సోదరుడిపై 2022లో నమోదైన కేసుల్లో ఒకదానిలో హత్య, వరకట్న వేధింపులు, అసహజ సెక్స్ వంటి ఆరోపణలు ఉన్నాయని శర్మ పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత అతని భార్య కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిపాడు.
 
తన భార్య తనకు, తమ కుమారుడికి నెలవారీ రూ.2 లక్షల భరణం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు శర్మ పేర్కొన్నారు. తనపై తన భార్య గృహ హింస కేసు పెట్టిందనీ, తరువాత ఆమె ఉపసంహరించుకుందని వెల్లడించాడు. అయితే తాజాగా మరోసారి అతడిపై గృహ హింస కేసు పెట్టింది. అతనిపై దాఖలైన పలు కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆమె రెండు దరఖాస్తులను కూడా సమర్పించినట్లు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్: రేషన్ బియ్యం వేల కోట్ల రూపాయల స్మగ్లింగ్‌ వస్తువుగా ఎలా మారింది?