Woman Arrest in SI Harish Suicide తెలంగాణ రాష్ట్రంలోని వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్ నగరంలో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆమె గురించి ఆరా తీసిన హరీష్‌కు, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊరులో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని విషయం తెలిసింది.
దీంతో హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. అదే విషయం ఆమెకు చెప్పడంతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సెటిల్మెంట్ చేసుకోవడానికి హరీష్ ప్రయత్నించగా, ఇందుకు యువతి ఒప్పుకోకుండా, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాననడంతో మనస్తాపంతో హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణమంటూ హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరోవైపు, వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు
హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం. డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఆ యువతి లొంగదీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్‌ను కూడా ప్రేమలోకి దించిందని సమాచారం.
ఈ నెల 14న నిశ్చితార్థం ఉండగా.. హరీష్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి హరీష్‌తో పాటే ఉంది. దీంతో ఈ విషయాలు తెలియడంతో మనస్తాపానికి గురై ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక యువతి బెదిరించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.