Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలగిరిలో అల్లుడి కిరాతకం : అత్త - భార్య నరికివేత

Advertiesment
Hyderabad Double Murder
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (16:35 IST)
భాగ్యనగరిలో వరుసగా నేరాలు జరుగుతున్నారు. ఇటీవల ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం ఆ తర్వాత హత్యకు గురైంది. బుధవారం రాత్రి మరో తొమ్మిదేళ్ళ చిన్నారిపై లైంగికదాడి జరిగింద. తాజాగా ఓ అల్లుడు కిరాతకుడుగా మారిపోయాడు. కట్టుకున్న భార్యతో పాటు.. పిల్లనిచ్చిన అత్తను కూడా దారుణంగా చంపేశాడు. ఈ జంట హత్యలు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. 
 
ఈ హత్యలపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తిరుమలగిరి మిలటిరీ ఆస్పత్రిలో పనిచేసే నాగపుష్ప అనే యువతితో అదే ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న చిన్నబాబుతో వివాహం జరిగింది. వీరిద్దరూ తిరుమలగిరి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
 
అయితే, ఇటీవల వారి కుటుంబంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో తీవ్రఆవేశానికి లోనైన చిన్నబాబు.. నాగ పుష్పను, అడ్డుగా వచ్చిన ఆమె తల్లిని కత్తితో నరికి అతి కిరాతకంగా హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
హత్యా స్థలానికి చేరుకున్న తిరుమలగిరి పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ హత్యకు సంబంధించి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజు ఆత్మహత్య.. అత్త హర్షం.. భార్య పేరు పచ్చబొట్టు.. అయినా నరకమే