అక్కా అంటూ ఓ కామాంధుడు పక్కింట్లోకి వచ్చిన ఓ యువకుడు ఆ మహిళ కుమార్తెపై కన్నేసి శీలంపై కాటేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మోతీ నగర్‌కు చెందిన బత్తుల శివ (33) కారు డ్రైవర్‌గా జూబ్లీ హిల్స్‌లో రోడ్డు నంబరు 45లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో బిల్డింగ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మహిళను పరిచయం చేసుకుని అక్కా అంటూ తరచూ ఇంటికి వెళ్ళి, ఆమె భర్తతో కలిసి మద్యం సేవించేవాడు. ఆ మహిళ మాత్రం అదే భవనం మొదటి అంతస్తులో పాచిపనిచేస్తుంది. బాధితురాలి సోదరుడు కూడా అదే భవంతిలో కూడా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మొదటి అంతస్తులో ఉన్నాడు.
రాత్రి 8 గంటల సమయంలో బాధిత యువతి ఇంట్లో ఉండగా బత్తుల శివ వచ్చాడు. రాత్రి 11.30 గంటల వరకు ఇద్దరూ మాట్లాడుకున్నాడు. ఇక తాను వెళ్తానని చెప్పగా ఆ యువతి బెడ్‌పై నిద్రకు ఉపక్రమించింది. అర్థగంట తర్వాత ఆమె మేల్కొనగా శివ కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసేందుకు ప్రయత్నించింది. దిండుతో ఆమె నోరు నొక్కేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరీ చెప్పొద్దని, నువ్వు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్లిపోగా జరిగిన ఘటనపై బాధిత యువతి తీవ్రంగా రోదిస్తూ తల్లికి విషయం చెప్పింది. ఈ మేరకు పోలీసులు బత్తుల శివపై బీఎన్ఎస్ సెక్షన్ 64 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.