Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాహేతర సంబంధం: మటన్ కత్తితో రెండు ముక్కలు చేశారు

వివాహేతర సంబంధం: మటన్ కత్తితో రెండు ముక్కలు చేశారు
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:34 IST)
కృష్ణా జిల్లాలో వళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న కోపంతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఓ వ్యక్తిని మటన్ కత్తి తీసుకుని అతి దారుణంగా రెండు ముక్కలుగా నరికి చంపారు. ఆ తర్వాత ఆ శరీర భాగాలను చల్లపల్లి కెనాల్ లో పడేశారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పమిడిముక్కల మండలం అగినిపర్రుకి చెందిన మటన్ వ్యాపారి ఏడుకొండలు తన కుమారుడితో కలిసి సహచర వ్యాపారి నాంచారయ్యను రెండు ముక్కలుగా నరికి చంపేశారు. ఆ తర్వాత ఆ శవాన్ని కాలువలో తొక్కేశారు.
 
నాంచారయ్య ఆచూకి తెలియకపోవడంతో అతడి సోదరుడి కుమారుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసి శవాన్ని తొక్కేసిన స్థలం వివరం చెప్పారు. కాగా ఈ హత్యకు కారణాలు ఏమిటన్నది ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి సేవ‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా!