Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తలు, కన్నబిడ్డలను కట్టేసి.. వారి కళ్లెదుటే మహిళలపై అత్యాచారం

Advertiesment
crime
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (12:20 IST)
హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో దారుణం జరిగింది. నలుగురు దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులైన భర్తలు, వారి పిల్లలను కట్టేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారి ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకుని పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పానిపట్‌లోని ఓ ప్రాంతంలో మహిళా కూలీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. బుధవారం రాత్రి వారంతా వారి ఇంట్లోనే నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని దండగులు వారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వారి చేతుల్లో కత్తులు, ఇతర పదుపైన మారణాయుధాలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు భయపడిపోయి నోరు మెపదలేదు. 
 
ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆ మహిళా కులీల కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత వారి కళ్లెదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత వారివద్ద ఉన్న డబ్బులు, నగదు దోచుకుని పారిపోయారు. ఈ ఘటన జిరగిన ఆ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఇలాంటి ఘటనే జరగడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు.. తన గురించే దేశం మొత్తం తెలుసు...