ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో చివరి క్షణం వరకు పోరాడి ఓడిన న్యూజిలాండ్ జట్టు ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ తుది సమరంలో కివీస్ టెక్నికల్‌గా ఓడిపోయింది. నిజం చెప్పాలంటే.. కివీస్ పరాజిత జట్టు కాదు.. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న హృదయ జట్టు అని చెప్పారు.
ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫలితంపై యువరాజ్ సింగ్ స్పందించారు. బౌండరీ రూల్‌తో తాను ఏకీభవించనని స్పష్టం చేశారు. అయితే, నిబంధన నిబంధనేనని చెప్పారు. ప్రపంచ కప్‌ను సాధించిన ఇంగ్లండ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చివరి క్షణం వరకు విజయం కోసం వీరోచితంగా పోరాడిన న్యూజిలాండ్ ఎంతో ఆకట్టుకుందని చెప్పాడు. అదొక అద్భుతమైన ఫైనల్స్ అని కితాబిచ్చాడు.