Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సూపర్ ఉమెన్స్' అంటూ కోహ్లీ ప్రశంసలు.. ఉబ్బితబ్బిబ్బులైపోతున్న మహిళా క్రికెటర్లు

Advertiesment
kohli video call

ఠాగూర్

, సోమవారం, 18 మార్చి 2024 (09:36 IST)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చెందిన మహిళా క్రికెటర్లు తొలి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ క్రికెటర్లకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపారు. సూపర్ ఉమెన్స్ అంటూ ఇన్‌స్టాలో ప్రశంసల వర్షం కుర్పించారు. డబ్ల్యూపీఎల్ ట్రోఫీని తొలిసారి ఆర్సీబీ ఉమెన్స్ జట్టు కైవసం చేసుకుంది. దీంతో ఆర్సీబీకి చెందిన పురుషుల క్రికెటర్లు కూడా తెగ సంతోషపడిపోతున్నారు. ఆర్సీబీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంథానకు విరాట్ కోహ్లీ వీడియో కాల్ చేసి అభినందలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే, తన ఇన్‌స్టా వేదికగా కూడా కోహ్లీ స్పందించాడు. ట్రోఫీని సాధించిన ఆర్సీబీ ఉమెన్స్ జట్టును "సూపర్ ఉమెన్స్" అంటూ ప్రశంసించాడు. 
 
కాగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్, ఆర్సీబీ ఉమెన్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీపై ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మరో మూడు బంతులు మిగిలివుండగానే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంథాన (31), సోఫి (32), ఎల్లీస్ పెర్రీ (35 నాటౌట్) ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా ఐపీఎల్ 2008లో ఆరంభమవ్వగా ఆర్సీబీ పురుషుల జట్టు ఇప్పటికి ఒక్కసారి కూడా టైటిల్ను గెలుచుకోలేకపోయింది. ఆ జట్టు టైటిల్ను ఇంకా ఒక కలగానే ఉందన్న విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికలు.. యూఏఈకి ఐపీఎల్ 2024 షిఫ్ట్.. ఇందులో నిజమెంత?