Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ వేదికగా భారత్ - ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్

uppal stadium

వరుణ్

, మంగళవారం, 16 జనవరి 2024 (11:51 IST)
హైదరాబాద్ వేదికగా భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లీష్ జట్టు భారత్‌కు రానుంది. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ఈ నెల 25వ తేదీ నుంచి మొదలుకానుంది. తొలి టెస్టుకు హైదరాబాద్ వేదికగాకానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటికే సన్నాహకాలను మొదలుపెట్టాయి. 
 
ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్‌లో ఆడని టీమిండియా ఆటగాళ్లు రంజీ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు అబుదాబి శిక్షణా శిబిరంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సిరీస్ ఆరంభానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 
 
ఇంగ్లీష్ బ్యాటర్లకు భారత స్పిన్నర్ల నుంచి సవాలు ఎదురుకానుందని భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే ఉపఖండ పరిస్థితుల్లో తాను చాలా మ్యాచ్‌లు ఆడానని, రాబోయే సిరీస్‌లో రాణిస్తున్నానని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో రాణించి జట్టులో స్థిరమైన చోటు సంపాదించుకున్న బెన్ డకెట్ 'స్కై స్పోర్ట్స్ క్రికెట్'తో మాట్లాడాడు.
 
గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో చాలా నేర్చుకున్నానని, బ్యాటర్లు పరిణితి చెందానని డకెట్ చెప్పాడు. టీమిండియా బౌలర్లు ఎలాంటి బంతులు సంధించినా సమర్థవంతంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఉపఖండ పిచ్‌లపై బ్యాటింగ్ చేసిన అనుభవం తనకు కలిసొస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. గత కొన్నేళ్లుగా తాను చాలా పరిణితి చెందినప్పటికీ అశ్విన్ లాంటి తెలివిగల వ్యక్తి తనపై పైచేయి సాధించగలడని డకెట్ పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యేడాది తర్వాత బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ.. నేడు రెండో టీ20