Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేన్ మామ వికెట్ తీసిన అక్షర్ పటేల్.. కాళ్లు మొక్కబోయిన విరాట్ కోహ్లి! (Video)

Advertiesment
kohli - axar

ఠాగూర్

, సోమవారం, 3 మార్చి 2025 (13:43 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 249 పరుగులు మాత్రమే చేసింది. 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 205 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 44 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంలో భారత స్పిన్నర్లు కీలక పాత్రను పోషించారు. ముఖ్యంగా కివీస్ జట్టుకు వెన్నెముకగా నిలిచే కేన్ మామ వికెట్‌ను అక్షర్ పటేల్ తీశాడు. ఆ సమయంలో బౌలర్ అక్షర్ పటేల్ కాళ్ళు మొక్కేందుకు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రయత్నించాడు. అయితే, అక్షర్ పటేల్ అడ్డుపడ్డాడు. 
 
నిజానికి ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నప్పటికీ కేన్ మామ మాత్రం మరో ఎండ్‌లో పరుగులు పిండుకుంటున్నాడు. అతని జోరు చూస్తుంటే ఒకానొక దలో కివీస్ విజయం ఖాయమనే పరిస్థితి నెలకొంది. కానీ, అక్షర్ పటేల్ ఓ అద్భుతమైన బంతిని విసిరాడు. దాన్ని ఆడే క్రమంలో స్టంపౌట్ అయ్యాడు. దాంతో భారత్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. 
 
అయితే, కేన్ మామ వికెట్ తీసిన అక్షర్ పటేల్ కాళ్లను తాకేందుకు విరాట్ కోహ్లి ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కాగా, కివీస్‌తో జరిగిన మ్యాచ్‍‌లో అక్షర్ పటేల్ ఆల్‌‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు 46 పరుగులు చేశాడు. అలాగే, బౌలింగ్‌లో రాణించి కీలకమైన వికెట్‌ను పడగొట్టాడు. ఫీల్డింగ్‌‍లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను కూడా పట్టాడు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహిత్ శర్మ బరువు తగ్గాలి...కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్