Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టేడియంలో సందడి చేసిన మిస్టీరియస్ బ్యూటీ ఎవరు?

Advertiesment
స్టేడియంలో సందడి చేసిన మిస్టీరియస్ బ్యూటీ ఎవరు?
, ఆదివారం, 5 మే 2019 (12:55 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.
 
ఈ సీజన్‌లో కోహ్లీ సేనకు ఇదే ఆఖరి మ్యాచ్. పైగా, పాయింట్ల పట్టిలో ఆర్సీబీ ఆఖరున ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, చివరి మ్యాచ్‌ల కోహ్లీ సేన ఘన విజయం సాధించండంతో బెంగళూరు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టోర్నీలో ఆశించినంతగా రాణించకపోయిన చివరి మ్యాచ్‌లో విజయంతో ముగించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. 
 
ఇదిలావుంటే ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ యువతి ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షించింది. తన క్యూట్ లుక్స్‌తో క్రికెట్ ప్రేమికుల మతిపొగొట్టింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కెమెరాలు ఈ బ్యూటీని కవర్ చేయగా, ఆ సమయంలో ఆమె హవభావాలకు నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఆర్సీబికి మద్దతుగా వచ్చిన ఆ యువతి మ్యాచ్ జరిగినంత సేపు గ్యాలరీలో తోటి ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది.
 
బెంగళూరు మ్యాచ్ గెలిచి అభిమానులకు ఆనందం తెచ్చి పెడితే… ఈ బ్యూటీ మాత్రం తన సౌందర్యంతో అక్కడికి వచ్చిన ప్రేక్షకులతో పాటు నెటిజన్ల హృదయాలు కొల్లగొట్టింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అంతర్జాలంలో ఎవరీ మిస్టరీ గర్ల్ అంటూ నెటిజన్స్ సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఓవర్ నైట్‌స్టార్‌గా ఈ మిస్టీరియస్ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్‌గా అవతరించింది. 
 
ఆ తర్వాత నెటిజన్ల శోధన ఫలితామని ఈ మిస్టరీ గర్ల్ గురించిన వివరాలు వెల్లడయ్యాయి. ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా యువతి పేరు దీపిక ఘోష్‌గా గుర్తించారు. దాంతో ఈ బ్యూటీ అందాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ప్రియ ప్రకాష్ వారియర్‌ను మరిచిపోకముందే ఇప్పుడు దీపిక ఘోష్ సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకానికి సచిన్ కుమారుడు.. రూ.5 లక్షలు పలికిన ధర