Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17 యేళ్ల నిరీక్షణకు తెర... విశ్వవిజతగా టీమిండియా... ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Advertiesment
team india

వరుణ్

, ఆదివారం, 30 జూన్ 2024 (09:33 IST)
భారత క్రికెట్ జట్టు విశ్వవేదికగా 17 యేళ్ల నిరీక్షణకు తెరపడింది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సేన విశ్వవిజేతగా నిలిచింది. దీంత 17 యేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారత క్రికెట్ జట్టు ఐసీసీ ట్రోఫీని చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2007 పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇపుడు 17 యేళ్ల తర్వాత రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచ కప్‌‌లో ప్రపంచ విజేతగా భారత్‌ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. విజేత భారత్‌కు, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు భారీ మొత్తంలోనే ప్రైజ్‌మనీ దక్కింది. సెమీస్‌లో నిష్క్రమించిన జట్లకూ ఐసీసీ ప్రైజ్‌మనీని అందించింది. 
 
ప్రైజ్‌మనీ వివరాలు (దాదాపు) ఇలా...
విజేత : భారత్‌కు రూ.20.50 కోట్లు 
రన్నరప్‌ : దక్షిణాఫ్రికాకు రూ.10.60 కోట్లు 
సెమీఫైనలిస్టులు : ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌కు చెరో రూ.6.50 కోట్లు 
సూపర్‌-8కు చేరిన 12 జట్లు : ఒక్కో టీమ్‌కు రూ.2 కోట్లు 
13 నుంచి 20వ స్థానంలోని ఒక్కో టీమ్‌కు రూ.1.90 కోట్లు 
ప్రతి జట్టు విజయం సాధించిన మ్యాచ్‌కు అదనంగా రూ.26 లక్షలు 
టీ20 ప్రపంచ కప్‌ ప్రైజ్‌మనీ మొత్తం విలువ రూ.93.80 కోట్లు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరాలు తెగే ఉత్కంఠ పోరులో T20 ప్రపంచ కప్‌ను ముద్దాడిన రోహిత్ సేన (video)