Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్‌ కండకావరం.. టోర్నీ నుంచి నిష్క్రమించేందుకే అలాంటి మాటలు..?

Advertiesment
T20 WC
, మంగళవారం, 2 మార్చి 2021 (13:24 IST)
భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ ​కప్​ కోసం వీసాల మంజూరు విషయంపై పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వీసాల మంజూరు విషయంలో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ప్రతిపాదించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. 
 
క్రీడాకారుల వీసాలకు సంబంధించి ఎటువంటి ఆంక్షలూ ఉండవని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. పాక్‌ అభిమానులకు, జర్నలిస్టులకు సైతం వీసాలు మంజూరు చేయాలని పీసీబీ చైర్మన్‌ ఎహసాన్‌ మణి కోరటాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. వీసాల మంజూరు విషయంపై మార్చి నెలాఖరులోగా తమ నిర్ణయం చెప్పాలని షరతులు విధించడం పాక్‌ కండకావరంగా పేర్కొంది. 
 
తమ డిమాండ్లను తీర్చని పక్షంలో వేదికను యూఏఈకి మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తామని బెదిరించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పీసీబీ చేసిన ప్రతిపాదనలు అపరిపక్వతతో కూడినవిగా కొట్టిపారేసింది. 
 
టోర్నీ నుంచి నిష్క్రమించే ఉద్ధేశంతోనే పీసీబీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. ఇక ఎహ్‌సాన్ మణి వ్యాఖ్యలను తమను ఆశ్చర్యానికి గురిచేశాయని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాక్సిన్ తీసుకున్న టీమిండియా కోచ్ రవిశాస్త్రి..