బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ టీ-10 లీగ్‌లో సందడి చేసింది. క్రికెట్‌లో పొట్టి క్రికెట్ అయిన టీ20 అందరికీ తెలుసు. దాంట్లోనే ఇంకా పొట్టిదైన టీ10 ఇప్పుడిప్పుడే దుమ్మురేపుతోంది.
ఇప్పటికే రెండేళ్లలో రెండు సీజన్లు అయిపోయాయి. ఇప్పుడు మూడో సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో ఢిల్లీ బుల్స్ జట్టుకు బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఇప్పటికే జట్టు ప్రమోషన్‌లో బిజీ బిజీగా వుంది. ఇకపోతే.. టోర్నీ ప్రారంభోత్సవంలోనూ దుమ్మురేపింది.
మ్యాచ్ ప్రారంభం సందర్భంగా స్టేడియంలో తిరుగుతూ ఫ్లాగ్‌తో ఫ్యాన్స్‌ని పలకరించడం ప్రత్యేక ఫీలింగ్ అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది సన్నీ లియోన్. ఢిల్లీ బుల్స్ జట్టు ఇంతకుముందు బెంగాల్ టైగర్స్ పేరుతో ఆడింది.
ఈ టీ10 లీగ్‌ను టీ10 స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో 10 ఓవర్లే ఉంటాయి. జస్ట్ 90 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుంది. 2017లో తొలిసారి ఈ లీగ్ మొదలైనప్పుడు ఎనిమిది ఓవర్లే వుండేవి. ఆ ఏడాది కేరళ కింగ్స్ విన్నర్‌గా నిలిచారు. తర్వాతి ఏడాది ఆగస్టులో మొదలైన ఈ లీగ్‌కి ఐసీసీ అధికారికంగా ఆమోదం ఇచ్చిన సంగతి తెలిసిందే.