Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జింబాబ్వేపై స్కాట్లాండ్ అదుర్స్.. కేవలం 41 బంతుల్లోనే అతివేగ రెండో సెంచరీ

జింబాబ్వేపై స్కాట్లాండ్ అదుర్స్.. కేవలం 41 బంతుల్లోనే అతివేగ రెండో సెంచరీ
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:54 IST)
నెదర్లాండ్‌తో ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ క్రికెటర్లు అదరగొట్టారు. వీరిలో ఓపెనర్ హెన్రీ జార్జ్ మున్సే టీ-20 క్రికెట్‌లో రికార్డులతో అదరగొట్టాడు. కేవలం 41 బంతుల్లోనే శతకం నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ ట్వంటీ-20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. 56 బంతుల్లో 127 పరుగులు చేసిన మున్సే 14 సిక్స‌ర్లు, 5 ఫోర్లు కొట్టాడు. 
 
మున్సేతో పాటు కెప్టెన్‌ కోయిట్జర్‌ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. వీరిద్ద‌రి వీర ఉతుకుడుతో స్కాట్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 41 బంతుల్లో సెంచ‌రీ చేసిన మున్సే ఫాస్టెస్ట్‌ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిషబ్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రవిశాస్త్రి.. ఎందుకో తెలుసా?