Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : సఫారీలకు షాకిచ్చిన డస్ జట్టు

netherlands team
, బుధవారం, 18 అక్టోబరు 2023 (09:52 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టుకు డచ్ ఆటగాళ్లు తేరుకోలేని షాకిచ్చారు. మొన్నటికిమొన్న పటిష్టమైన, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ జట్టును ఆప్ఘనిస్తాన్ జట్టు చిత్తుగా ఓడించింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను నెదర్లాండ్ జట్టు ఓడించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 38 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించి సంచనం సృష్టించారు.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆ తర్వాత 43 ఓవర్లలో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక సఫారీలు చతికిలబడ్డారు. 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయ్యారు. డచ్ బౌలర్లు సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికా పనిబట్టారు. వాన్ బీక్ 3, వాన్ మీకెరెన్ 2, వాన్ డెర్ మెర్వ్ 2, బాస్ డీ లీడ్ 2, అకెర్ మన్ 1 వికెట్ తీశారు.
 
సౌతాఫ్రికా జట్టులో జట్టులో డికాక్, మార్ క్రమ్, మిల్లర్, బవుమా, డుస్సెన్, క్లాసెన్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ ఆరెంజ్ ఆర్మీ ముందు తలవంచక తప్పలేదు. వరల్డ్ కప్‌లో గత రెండు మ్యాచ్‌ల్లో సాధికారికంగా నెగ్గిన సఫారీలు మంగళవారం నెదర్లాండ్స్‌ను ఓ ఆట ఆడుకుంటారని అందరూ భావించారు. కానీ... ఇది క్రికెట్! ఏమైనా జరగొచ్చు అని నిరూపిస్తూ... సఫారీలను డచ్ సేన కుమ్మేసింది. 
 
మిల్లర్ 43, క్లాసెన్ 28, కోట్టీ 22, డికాక్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో సఫారీలకు పరాభవం తప్పలేదు. మ్యాచ్ ఆఖరులో కేశవ్ మహరాజ్ పోరాడినా ఫలితం లేకపోయింది. కేశవ్ మహరాజ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఓవర్లను 43కి కుదించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెటర్