Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా పోరు

aus vs sa
, గురువారం, 12 అక్టోబరు 2023 (12:05 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం కీలక పోరు జరుగనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే ఈ పోరు ఇరు జట్లకూ అత్యంత కీలకంగా మారింది. ఆస్ట్రేలియా ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఖంగుతిన్న కంగారులు... ఈ మ్యాచ్‍లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఈ పోరులో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొంటోంది. 
 
బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఆల్ రౌండర్ స్టోయినిస్‌ను తుది జట్టులో చేర్చాలనుకుంటోంది. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్.. ఈసారి టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఆరు వికెట్లతో చిత్తయిన సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంకతో తొలి పోరులో 102 పరుగులతో అద్భుత విజయం సాధించిన సఫారీలు ఇనుమడించిన ఉత్సాహంలో ఉన్నారు. 
 
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన తీరు ఆసీస్ జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కారణం బ్యాటింగ్ దూకుడు లోపించడమే. వార్నర్, స్మిత్ మినహా ఎవరూ 30కిపైగా రన్స్ చేయకపోవడం గమనార్హం. చెపాక్‌లోని స్లో వికెట్‌పై నాణ్యమైన భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఆసీస్ ఆటగాళ్లు ఆపసోపాలు పడ్డారు. ఇది చాలదన్నట్టు రెండో స్పెషలిస్టు స్పిన్నర్ లేకపోవడం కంగారూల కష్టాలను రెట్టింపు చేసింది.
 
ఇక దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. శ్రీలంక బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ డికాక్, డుసెన్, మార్క్రమ్ సెంచరీలతో దుమ్మురేపడంతో ఆ జట్టు బ్యాటింగ్ తిరుగులేకుండా ఉంది. కానీ రబాడ, ఎంగిడి, జాన్సెన్ పేస్ త్రయం పరుగులను నియంత్రించడంలో విఫలమవుతోంది. వరల్డ్ కప్‌కు ముందు తమ దేశంలో ఆసీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో 0-2తో వెనుకంజలో నిలిచిన సౌతాఫ్రికా ఆపై అనూహ్యంగా పుంజుకొని 3-2తో నెగ్గింది. దీంతో వరల్డ్ కప్ పోరులో కంగారూలపై సఫారీలదే పైచేయి అయ్యే చాన్సుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - పాకిస్థాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ప్రత్యేక రైళ్లు