Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధర్మశాల టెస్టులో భారత్‌దే గెలుపు.. 2-1 తేడాతో సిరీస్ కైవసం.. ర్యాంకింగ్స్‌లో ఇండియానే నెం.1

ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ ఘనవిజయం సాధించింది. తద్వారా చివరి టెస్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. భా

Advertiesment
ధర్మశాల టెస్టులో భారత్‌దే గెలుపు.. 2-1 తేడాతో సిరీస్ కైవసం.. ర్యాంకింగ్స్‌లో ఇండియానే నెం.1
, మంగళవారం, 28 మార్చి 2017 (11:49 IST)
ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా జట్టుపై భారత్ ఘనవిజయం సాధించింది. తద్వారా చివరి టెస్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. భారత క్రికెటర్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాల్లో ఆసీస్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. తద్వారా భారత్ చివరి టెస్టులో విజయఢంకా మోగించింది. 
 
చివరి టెస్టు భారత్-ఆస్ట్రేలియాలకు కీలకంగా మారింది. చివరి టెస్టు ప్రారంభానికి ముందు ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమజ్జీవులుగా ఉండటంతో ధర్మశాల టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు కసితో బరిలోకి దిగాయి.
 
అయితే చివరి టెస్టు తొలి రోజు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ను భారత్‌ 300 పరుగులకే కట్టడి చేసింది. భుజం గాయం కారణంగా కోహ్లీ స్థానంలో అనూహ్యంగా తుది జట్టులో స్థానం దక్కించుకున్న కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు. భారీ స్కోరు సాధించే దిశగా ఉన్న ఆసీస్‌ ఆశలకు కుల్‌దీప్‌ బ్రేక్ వేశాడు. తద్వారా ఆస్ట్రేలియా 300 పరుగులకే చేతులెత్తేసింది. 
 
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 332 పరుగులు సాధించింది. ఓపెనర్‌ రాహుల్‌(60), పుజారా(57), రహానె(46) అద్భుత ప్రదర్శన చేశారు. అనంతరం ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 63 పరుగులు చేయడంతో భారత్‌ ఆధిక్యం సాధించింది. ఆపై రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాను ఉమేశ్ దెబ్బతీశాడు. తద్వారా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే పరిమితమైంది. 
 
దీంతో 106 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 51పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణయాత్మక చివరి టెస్టులో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని దక్కించుకోవడంతో పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లిది దొంగ వేషం... ఐపీఎల్‌లో ఆడకపోతే నేను నమ్ముతా...