Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లిది దొంగ వేషం... ఐపీఎల్‌లో ఆడకపోతే నేను నమ్ముతా...

భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బ్రాడ్‌ హాగ్ సంచలన ఆరోపణలు చేశారు. కోహ్లీకి భుజం నొప్పి అన్నది ఉత్తుత్తిదేనన్నారు. త్వరలో స్వదేశంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల్లో పాల్గొనేందుకే ప్రస్తుతం ఆస్ట్రేలియా జ

Advertiesment
కోహ్లిది దొంగ వేషం... ఐపీఎల్‌లో ఆడకపోతే నేను నమ్ముతా...
భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బ్రాడ్‌ హాగ్ సంచలన ఆరోపణలు చేశారు. కోహ్లీకి భుజం నొప్పి అన్నది ఉత్తుత్తిదేనన్నారు. త్వరలో స్వదేశంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల్లో పాల్గొనేందుకే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌ను ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. 
 
ప్రస్తుతం గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీకి కోచ్‌గా ఉన్న బ్రాడ్ హాగ్ ఫాక్స్ స్పోర్ట్స్ న్యూస్‌తో మాట్లాడుతూ... ఏప్రిల్ 5 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనుందని గుర్తు చేశాడు. 
 
ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం సిద్ధమయ్యేందుకే కోహ్లీ చివరి టెస్ట్ మ్యాచ్‌కు ఎగ్గొట్టాడని ఆరోపించారు. నిజంగా కోహ్లీ తీవ్ర గాయాలతోనే ఈ మ్యాచ్‌కి దూరమైన మాట నిజమే అయితే, మరికొద్ది రోజుల్లో గుజరాత్ లయన్స్ టీమ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ కోహ్లీ ఆడకూడదని హాగ్ అన్నాడు. టెస్టు మ్యాచ్‌ని ఆడకుండా, ఆపై వారంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొంటే, అది చాలా దరిద్రంగా ఉంటుందని అభివర్ణించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధర్మశాల టెస్ట్ : కంగారెత్తించిన భారత స్పిన్నర్లు... ఆసీస్ ఆలౌట్... భారత టార్గెట్ 106 రన్స్