Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈడెన్‌లో భారత్‌దే విజయం... న్యూజిలాండ్‌కు మళ్లీ పరాభవం... సిరీస్ కైవసం

కోల్‌కతాలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. కాన్పూర్ టెస్టును సునాయాసంగా గెలుచుకున్న టీమిండియా, రెండో టెస్టును కూడా అదే తరహాలో గెలుచుకుంది. వాస్తవానికి రెండు టెస్టులను న్యూజిలా

Advertiesment
Kolkata
, సోమవారం, 3 అక్టోబరు 2016 (17:25 IST)
కోల్‌కతాలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. కాన్పూర్ టెస్టును సునాయాసంగా గెలుచుకున్న టీమిండియా, రెండో టెస్టును కూడా అదే తరహాలో గెలుచుకుంది. వాస్తవానికి రెండు టెస్టులను న్యూజిలాండ్ జట్టు ఘనంగా ప్రారంభించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో గట్టి పోటీ ఇచ్చింది. అయితే ప్రపంచ స్థాయి జట్టుపై కివీస్ ప్రదర్శన స్థాయికి తగ్గట్టులేదు. దీంతో కివీస్ జట్టు ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. ఇది భారత్‌కు సొంతగడ్డపై 250వ టెస్ట్ విజయం కావడం గమనార్హం. 
 
తొలి టెస్టులో అశ్విన్ జడేజాలు భారత్‌కు విజయాన్ని కట్టబెడితే, రెండో టెస్టును భువనేశ్వర్ కుమార్, షమీ భారత్‌కు విజయాన్ని బహుమతిగా అందజేశారు. వీరిద్దరూ స్వింగ్ బౌలింగ్‌తో న్యూజిలాండ్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఫలితంగా... కివీస్ బ్యాట్స్‌మెన్లలో లాంథమ్ (74), గుప్తిల్ (24), నికోలాస్ (24), రోంచీ (32), హెన్రీ (18) ఆకట్టుకున్నప్పటికీ టీమిండియాను ఓడించే ఆటతీరు ప్రదర్శించలేకపోయారు. 
 
ఇదేసమయంలో భారత బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మెన్‌పై పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 316 పరుగులు చేయగా, సమాధానంగా న్యూజిలాండ్ 204 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 263 పరుగులు చేయగా, కివీస్ కేవలం 197 పరుగులే చేయగలిగింది. దీంతో టీమిండియా వరుసగా రెండో టెస్టును కూడా గెల్చుకుంది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ (6), షమి (5), అశ్విన్ (4), జడేజా (4) వికెట్లతో రాణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీసీఐ బంపర్ ఆఫర్.. టెస్టు క్రికెటర్లకు జీతం డబుల్: ఈడెన్ మ్యాచ్‌లో డౌన్