బీసీసీఐ బంపర్ ఆఫర్.. టెస్టు క్రికెటర్లకు జీతం డబుల్: ఈడెన్ మ్యాచ్‌లో డౌన్
బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత టెస్టు క్రికెటర్ల మ్యాచ్ ఫీజును డబుల్ చేసింది ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్‌కు ఆడే ఆటగాడు రూ.7లక్షలు అందుకుంటున్నాడు. కానీ ప్రస్తుతం ఆ ఫీజు డబుల్ అయ్యింది. దాంతో ఒక్క
బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత టెస్టు క్రికెటర్ల మ్యాచ్ ఫీజును డబుల్ చేసింది ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్‌కు ఆడే ఆటగాడు రూ.7లక్షలు అందుకుంటున్నాడు. కానీ ప్రస్తుతం ఆ ఫీజు డబుల్ అయ్యింది. దాంతో ఒక్కో ఆటగాడు ఒక్కో మ్యాచ్‌కు రూ.15లక్షలు అందుకోనున్నాడు. టెస్టు మ్యాచ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు పెంచినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
కొత్త తరాల్లో, భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఠాకూర్ తెలిపారు. కాగా, బీసీసీఐ తన ఆధ్వర్యంలోని ఇతర సంఘాలకు వార్షికంగా ఇచ్చే సబ్సిడీని 60 లక్షల నుంచి రూ. 70లక్షలకు పెంచడం జరిగింది.
ఇదిలా ఉంటే.. ఈడెన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మరోసారి తడబడింది. 112 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలో దిగిన భారత్.. ఆదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ మురళి విజయ్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. అతడి స్థానంలో బ్యాటింగ్ దిగిన పుజారా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను మాట్ హెన్రీ పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ 9 ఓవర్లలో 26/2 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ధావన్ 13, కోహ్లీ(0) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ఇప్పటికి 138 పరుగుల ఆధిక్యంలో ఉంది.