పాకిస్థాన్ శాంతికాముక దేశం... యుద్ధానికి నో చెప్పండి : షాహిద్ ఆఫ్రిదీ
యూరీ ముష్కర దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేపట్టడంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియన
యూరీ ముష్కర దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేపట్టడంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సెలబ్రిటీలు జోక్యం చేసుకుంటున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే యుద్ధం రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ముందుకు వస్తున్నారు.
తాజాగా పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కూడా ముందుకు వచ్చాడు. గతంలో అఫ్రిదీ భారత్‌లో పర్యటించిన సందర్భంగా తాను క్రికెట్ ఆడిన అన్ని దేశాలకంటే.. భారత్‌లో ఆడటమే గొప్పగా భావించానని గతంలో వ్యాఖ్యానించిన అఫ్రిదీపై స్వదేశంలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని అన్నాడు. సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉండగా.. యుద్ధంలాంటి పరిస్థితులు తలెత్తేలా వ్యవహరించడం ఎందుకు? అని ప్రశ్నించాడు.
పాకిస్థాన్ శాంతికాముక దేశం అని.. ఇండియాతో పాకిస్థాన్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. ఇరు దేశాల మధ్య యుద్ధమే వస్తేగనుక భారత్, పాకిస్థాన్‌లు ఎంతో నష్టపోతాయని అన్నాడు. 'యుద్ధానికి నో చెప్పండి' అని సూచించాడు. దీంతో రెండు దేశాలు శాంతికే మొగ్గు చూపాలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. పొరుగు దేశాలతో పాక్ సహృద్భావ సంబంధాలు కోరుకుంటోందన్నాడు. ఇద్దరు పొరుగువారు గొడవ పడితే రెండిళ్లపైనా ప్రభావం పడుతుందని, యుద్ధం వద్దనాలని ట్వీట్ చేశాడు.