Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాప కనిపించలేదు.. తల్లి ఆవేదన.. మ్యాచ్ ఆపేసిన రఫెల్ నాదల్.... నిజమేనా?

Advertiesment
Rafael Nadal stops tennis match as mother searches for lost child in crowd
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (15:26 IST)
స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్ మానవత్వాన్ని చాటుకున్నాడు. తాను టెన్నిస్ ఆడుతున్న మైదానంలో పాప కనిపించలేదనే అలజడి మొదలు కావడంతోనే మ్యాచ్ ఆపేశాడు. ఆ పాప తిరిగి తల్లిని చేరేదాక నాదల్ కోర్టులో అలానే నిల్చుండిపోయాడు. ఈ ఘటన మల్లోర్కాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, సహచర ఆటగాడు సిమోన్ సోల్బాస్‌ల జోడి మల్లోర్కాలో బుధవారం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. 
 
సర్వీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతలోనే అలజడి. తన పాప కనిపించడం లేదంటూ ఓ తల్లి ఆవేదన చెందింది. ఆ పాప కోసం స్టేడియం అంతా కలియ తిరుగుతుంది. ఆ పాపం కోసం వెతుకుతోంది. 
 
అయితే సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో చోటు చేసుకునే సందడిని ఆటగాళ్లు పట్టించుకోరు. కానీ రఫెల్ మ్యాచ్‌ను ఆపేశాడు. ఆ తల్లి పాపకోసం పడుతున్న బాధను తనకు జరిగిన నష్టంగా భావించిన నాదల్ స్టేడియం వైపే తన దృష్టిని కేంద్రీకరించాడు. పాప దొరికేదాకా మ్యాచ్‌ను ఆపేశాడు. తద్వారా మానవత్వం చాటుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కివీస్‌తో రెండో టెస్టు.. శిఖర్ ధావన్ అవుట్‌కు కారణం అదేనా..? పూజారా అర్థ సెంచరీ..