Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కివీస్‌తో రెండో టెస్టు.. శిఖర్ ధావన్ అవుట్‌కు కారణం అదేనా..? పూజారా అర్థ సెంచరీ..

న్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు చుక్కెదురైంది. కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో రెండో టెస్టు తుది జట్టులోకి వచ్చిన ఓపెనర్ శి

Advertiesment
India vs New Zealand Live scores and updates
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (14:18 IST)
న్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు చుక్కెదురైంది. కివీస్ బౌలర్లు విజృంభించడంతో భారత బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో రెండో టెస్టు తుది జట్టులోకి వచ్చిన ఓపెనర్ శిఖర్ ధవన్ వైఫల్యంపై ట్విట్టర్ లో సెటైర్ల వర్షం కురుస్తోంది.

కేఎల్ రాహుల్ గాయంతో జట్టులో స్థానం సంపాదించిన శిఖర్ తన బాధ్యతను మరచి పేలవంగా నిష్క్రమించాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో బంతిని బ్యాక్ ఫుట్‌లో ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. ఒక పరుగు మాత్రమే చేసిన శిఖర్ సమయ పరిమితికి తాను ముగ్దుడ్ని అయ్యానంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఒకవేళ శిఖర్ పై జీవిత కథ తీస్తే ఈ విషయాన్ని కచ్చితంగా చూపించాలన్నాడు.

మరొక ట్వీట్‌లో పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ చేతికి వేసుకునే గ్లోవ్స్‌తో శిఖర్ ధవన్ గ్లోవ్స్ ను పోల్చుతూ ప్రశ్నలు సంధించారు. శిఖర్ తొందరగా అవుట్ కావడానికి కారణం ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని: ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమా బ్లాక్ టికెట్లు అమ్మడానికంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
 
కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆట‌గాళ్లు విరాట్‌ కోహ్లీ, శిఖ‌ర్‌ ధావన్, విజయ్‌లు కనీసం రెండంకెల స్కోరయినా చేయలేకుండా వికెట్లు సమర్పించుకన్న వేళ క్రీజులోకి అడుగుపెట్టిన అజింక్యా ర‌హానే, చటేశ్వర పుజారా మైదానంలో నిల‌దొక్కుకున్నారు. నిలకడైన ఆటతీరును క‌న‌బ‌రుస్తున్నారు.  పూజారా 189 బంతుల్లో 13 ఫోర్లతో 64 పరుగులు సాధించగా, రహానే 47 పరుగులతో అర్థ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

న్యూజిలాండ్ బౌల‌ర్లు బౌల్ట్‌, హెన్రీ బౌలింగ్ విసిరిన బంతుల ధాటికి 46 పరుగులకే టాప్ ఆర్డ‌ర్ ఘోరంగా విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ఒత్తిడిలో ఉన్న టీమిండియాను వారు గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం 64 పరుగుల‌తో పుజారా, 47 ప‌రుగుల‌తో ర‌హానే క్రీజులో ఉన్నారు. దీంతో టీ విరామానికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 136 పరుగులు సాధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంఎస్ ధోనీ మొదటి లవర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట!