Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంఎస్ ధోనీ మొదటి లవర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ప్రేయసి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట. ఈ విషయం ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎంఎస్ ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ అనే చిత్రంలో ప్రస్త

Advertiesment
tragic story of MS Dhoni
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (11:31 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి ప్రేయసి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందట. ఈ విషయం ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎంఎస్ ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ అనే చిత్రంలో ప్రస్తావన ఉందట. 
 
ఇందులో వివాహానికి పూర్వం అతడి ప్రేమ జీవితానికి సంబంధించిన వివరాలు ఉంటాయని అనుకుంటుంటే.. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోనీ ప్రేమ కథకు సంబంధించిన సీన్లను నటించినప్పుడు తన గుండె భారమైందని అంటూ పలు ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 
 
20 యేళ్ల వయసులో ఉన్నప్పటి ప్రేమ కథ అది అని టాక్. ఆమె పేరు ప్రియాంక ఝా అని సమాచారం. ఒకవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ, జాతీయ జట్టులో స్థానం కోసం ధోనీ ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆమె పరిచయం అయ్యిందని.. ధోనీ ఎదుగుతున్న దశలో ఒక రోడ్ యాక్సిడెంట్ లో ప్రియాంక మరణించిందని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవతలనుకుంటున్నారా? మర్యాదగా దారిలోకి వస్తారా?: బీసీసీఐకి సుప్రీం వార్నింగ్