Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ 15 సీజన్ పోటీలు

మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ 15 సీజన్ పోటీలు
, ఆదివారం, 23 జనవరి 2022 (11:00 IST)
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్నాయి. మార్చి నెలాఖరులో ఈ పోటీలను నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఐపీఎల్ 15వ సీజన్ పోటీలను స్వదేశంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. 
 
ఐపీఎల్ 15వ సీజన పోటీలను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కరోనా కేసులు అదుపులోకి రానిపక్షంలో లీగ్‌ను మరో దేశానికి తరలించక తప్పదన్నారు. స్వదేశంలోనే ఈ పోటీలు జరగాలని అన్ని ఫ్రాంచైజల యాజమానులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. 
 
ఒక వేళ స్వదేశంలో ఈ పోటీలు నిర్వహిస్తే మాత్రం అన్ని ఫ్రాంచైజీలు కోరుకున్నట్టుగా వాటివాటి సొంత నగరాల్లో ఈ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యంకాకపోవచ్చని తెలిపారు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆటగాళ్ళ భద్రత ముఖ్యమన్నారు. 
 
అందువల్ల మహారాష్ట్రలోని ముంబై, పూణెలలో పలు మైదానాలు ఉన్నందున, విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండానే కొత్త సీజన్‌లో పోటీలును ఆ మైదానాల్లోనే నిర్వహిచేలా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ రికార్డును బ్రేక్.. ఐపీఎల్‌ -2022లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా?