ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ పోటీల నిర్వహణ కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ పోటీలను ఇపుడు యూఏఈ వేదికగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు గురువారం నుంచి టికెట్లు అందుబాటులోకి తీసుకునిరానున్నారు.
ఈ టిక్కెట్లను ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ www.iplt20.com నుంచి వాటిని కొనుగోలు చేసుకోవచ్చని టోర్నీ నిర్వహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కొవిడ్-19 నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు చెప్పారు.
ఐపీఎల్ 14వ సీజన్ ఈ ఏ ఏడాది ఏప్రిల్‌లో తొలుత భారత్‌లో నిర్వహించగా బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. దీంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వహకులు ఆ రోజు ప్రకటించారు.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఈ టోర్నీని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో అన్ని ఫ్రాంఛైజీలు ఇప్పటికే యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలెట్టాయి. యూఏఈ నిబంధనలకు అనుగుణంగా ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నామని నిర్వహకులు ఒక ప్రకటనలో చెప్పారు.