Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం - అహ్మదాబాద్‌లో ఫైనల్!!

Advertiesment
ipl2024

ఠాగూర్

, మంగళవారం, 13 మే 2025 (19:07 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 టోర్నీ ఈ నెల 17వ తేదీన పునఃప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ నగరంలో జరుగనుంది. మరోవైపు, ఈ పోటీలను ఆరు వేదికల్లో మే 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 29 నుంచి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మే 29వ తేదీన క్వాలిఫయర్ -1, మే 30వ తేదీ ఎలిమినేటర్, జూన్ 1వ తేదీన క్వాలిఫయర్-2, జూన్ మూడో తేదీన ఫైనల్ జరుగనున్నాయి. 
 
ఈ మేరకు బీసీసీఐ సవరించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మిగిలిన లీగ్ మ్యాచ్‍ల కోసం జైపూర్ ముంబై, బెంగుళూరు, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలను ఖరారు చేసింది. ఇలా లీగ్ మ్యాచ్‌ల వేదికలు ఇప్పటికే నిర్ణయించినప్పటికీ, ప్లే ఆఫ్‌లను నిర్వహించే వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. 
 
అయితే, తాజా నివేదికల ప్రకారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కోల్‌కతా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ఇక్కడికి మార్పు చేసినట్టు వార్తలు వాస్తున్నాయి. అయితే, వాతావరణ సమాచారం. 
 
బోర్డు ప్రస్తుతం వేదికల వద్ద వర్షం పడే అవకాశాలను పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ ప్రారంభంలో అహ్మదాబాద్‌ల ఎటువంటి వర్షాలు ఉండవని భావించి, ఇదే వేదికలో ఫైనల్ నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ విషయానికి వస్తే ముంబై వేదిక ఒక ఛాయిస్‌గా ఉంది. 
 
కానీ, ఇది దేశంలో రుతుపవనాల రాకపై ఆధారపడి ఉంటుందని క్రిక్‌బజ్ పేర్కొంది. కొన్ని రోజుల క్రితం వాణిజ్య రాజధానిలో భారీ వర్షాలు కురిశాయి. అటు ఇదేసమయంలో వర్షం ప్రభావం అంతగా ఉందని ఢిల్లీ, జైపూర్ వంటి ఉత్తర భారత వేదికలను బీసీసీఐ ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2027 ప్రపంచ కప్‌కు దూరంగా ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు : గవాస్కర్