ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై చెపాక్‌లోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ తొలి ఓవర్లల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సునామీలా బౌలర్లపై విరుచుకుపడింది. బ్యాక్ అండ్ బ్యాక్ రెండు క్యాచ్‌లతో ఎంఎస్ ధోనీ ఫుల్ ఫామ్‌లో కనిపించాడు.
42 సంవత్సరాల వయస్సులో వికెట్ల వెనుక మెరుపులా కదిలాడు. వింటేజ్ లుక్స్‌తో అదరగొట్టాడు. భుజాల వరకు దిగిన పొడవాటి జుట్టుతో పాత ధోనీని గుర్తు చేశాడు. కెరీర్ ప్రారంభంలో లాంగ్ హెయిర్‌తో కనిపించిన ధోనీ.. కెరీర్ ఎండ్‌లోనూ అదే బ్రాండ్‌తో మెరిశాడు.
మరోవైపు ఐపీఎల్ 2024 ఓపెనర్‌లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలవడం మాత్రం ట్రోల్స్‌కు దారి తీసింది. మీమ్స్‌ను పోస్ట్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు ఫ్యాన్స్. ఎప్పుడు ఆర్సీబీ ఓడిపోతుందా అని కాచుకుని కూర్చున్నట్టు కనిపించారు మీమర్స్.
మ్యాచ్ ముగియకముందే ఫలితాన్ని ఊహించారు. మీమ్స్‌తో ఆర్సీబీని ఓ ఆట ఆడేసుకున్నారు. వీరిలో వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు సైతం ఉన్నారు.