ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఇది 17వ సీజన్. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ ప్రారంభ వేడుకలో బాలీవుడ్ అగ్రనటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లు సందడి చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ప్రముఖ సంగీత గాయకుడు ఏఆర్ రెహ్మాన్, సోను నిగమ్‌లు తమ గాన మాధూర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. అలాగే, ఇన్నింగ్స్ మధ్యలో కూడా సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే, రికార్డ్ ప్రొడ్యూసర్, రీమిక్స్ స్పెషలిస్ట్ ఆక్స్ వెల్ తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆలరించనున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వహాకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ కార్యక్రమంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఏఆర్ రెహ్మాన్, సోను నిగమ్ ఆడిపాడనున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరుగుతాయి. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారంకానున్నాయి.
ధోనీ ఫ్యాన్స్‌కు షాక్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్!!!
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 సీజన్ సందడి ప్రారంభంకానుంది. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు మేనేజ్‌మెంట్ తేరుకోలేని షాక్ ఇచ్చింది. జట్టు సారథ్య బాధ్యతల నుంచి ధోనీని తప్పించి రుతురాజ్‌ను ఎంపిక చేసింది. ఇక నుంచి చెన్నై జట్టుకు రుతురాజ్ సారథ్య బాధ్యతలను వహించనున్నాడు.
గత 16 సీజన్‌లుగా కెప్టెన్ వ్యవహరించిన ధోనీ వయసు రీత్యా ఆ బాధ్యతల నుంచి తప్పించి రుతురాజ్‌కు అప్పగించినట్టు సమాచారం. కాగా, రుతురాజ్ 2023 ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. పైగా, క్రీజ్‌తో పాటు మైదానంలోనూ అద్భుతంగా రాణించగల సత్తా ఉండటంతో సీఎస్కే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.