Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పానీపూరీ అమ్మిన యశస్వి.. ఐపీఎల్ పుణ్యంతో కరోడ్‌పతిగా మారాడు.. (video)

పానీపూరీ అమ్మిన యశస్వి.. ఐపీఎల్ పుణ్యంతో కరోడ్‌పతిగా మారాడు.. (video)
, శుక్రవారం, 20 డిశెంబరు 2019 (09:31 IST)
దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న 17ఏళ్ల యశస్వి ప్రస్తుతం కోటీశ్వరుడిగా మారాడు. స్కూల్‌ లెవల్‌ నుంచి రంజీ క్రికెటర్‌గా వేగంగా ఎదిగి ప్రస్తుతం అండ ర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న యశస్వి.. ఐపీఎల్‌ పుణ్యమా అని ఇప్పుడు కరోడ్‌పతిగా మారాడు.
 
ఒకప్పుడు పానీపూరీ అమ్మిన ఇతను.. ప్రస్తుతం కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. విజయ్‌ హజారే ట్రోఫీల్లో ముంబై తరఫున జైస్వాల్‌ డబుల్ సెంచరీతో ఈ రికార్డును బ్రేక్ చేశాడు. 
 
అన్‌క్యా్‌ప్డ ప్లేయర్‌గా యశస్వి కనీస ధర రూ. 20 లక్షలు కాగా.. ఎప్పుడూ దేశవాళీ స్టార్స్‌కు పెద్ద పీటవేసే రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 2.40 కోట్లకు అతడిని ఎగరేసుకు పోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి.. క్రికెటర్‌ కావాలనే లక్ష్యంతో ముంబై చేరుకున్నాడు. 
 
ఉండటానికి కనీస వసతి లేకపోవడంతో ఆజాద్‌ మైదానంలో ఓ టెంట్‌లోనే మూడేళ్లు గడిపాడు. పానీపూరీ అమ్మి అవసరాలు తీర్చుకునేవాడు. కోచ్ జ్వాలా సింగ్ ఆదరణతో రాణించాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగట్లో ఆటగాళ్లు : ఐపీఎల్ వేలంలో రూ. కోట్లు పలికిన పాట్ కమ్మిన్స్