Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియా కప్ : దాయాదుల సమరంలో టాస్ ఓడిన భారత్

Bharat-Pakistan
, ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (15:29 IST)
ఆసియా కప్ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం మధ్యాహ్నం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ టాస్ ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో భారత కుర్రోళ్లు బ్యాటింగ్‌కు దిగారు. గ్రూపు దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం గ్రూపు-4 దశలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. 
 
ఈ కీలక పోరులో టాస్ నెగ్గిన పాకిస్థాన్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వీపు నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్‌ జట్టులోకి తీసుకోగా, ఇంటీవల తండ్రి కావడంతో స్వదేశానికి వెళ్లి బుమ్రా తిరిగి చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా కప్ : నేడు దాయాదాలు సమరం - వాతావరణం పరిస్థితి ఏంటి?