Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా కప్ : నేడు దాయాదాలు సమరం - వాతావరణం పరిస్థితి ఏంటి?

Advertiesment
india - pakistan
, ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (12:59 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. లీగ్ మ్యాచ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇపుడు గ్రూపు-4లో విజేతలుగా నిలిచి మరోమారు తలపడటంతో ఆసక్తిగా మారింది. ఇక్కడ కూడానూ పాయింట్లు, రన్‌రేట్‌ కీలకం. కానీ, భారత్‌ను మాత్రం వర్షం వెంటాడుతూనే ఉంది. 
 
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్థాన్‌తో సూపర్-4లో టీమ్‌ఇండియా తలపడనుంది. కానీ, కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్‌కూ వరుణుడు ముప్పు పొంచి ఉంది. గ్రూప్‌ స్టేజ్‌లో ఇరు జట్ల మధ్య  మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌నైనా పూర్తిగా చూస్తామా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. అయితే, రిజర్వ్‌ డే ఉండటం అభిమానులను కాస్త ఊరటనిచ్చే అంశమే. ఈ క్రమంలో ఇవాళ కొలంబోలో వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే..?
 
తుది జట్టు ఎంపికే టీమ్‌ఇండియాకు అతిపెద్ద సవాల్‌. ఫిట్నెస్‌ నిరూపించుకుని వచ్చిన కేఎల్ రాహుల్‌తోపాటు మళ్లీ జట్టులో చేరిన జస్ప్రీత్‌ బుమ్రా తమ స్థానాల కోసం ఎదురు చూస్తున్నారు. బుమ్రా రావడంతో అతడిని తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమే. ఇక కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయాలంటే ఒకరిని పక్కన పెట్టాలి? యువ కీపర్-బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా రాణిస్తుండటంతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 
 
దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉంటుందనే వాదన నేపథ్యంలో బుమ్రా, సిరాజ్‌తోపాటు ప్రధాన పేసర్‌గా షమీని తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో పేస్‌ ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్‌ను బెంచ్‌కే పరిమితం చేయొచ్చు. శార్దూల్‌ బ్యాటర్‌గా రాణించిందేమీ లేదు. టాప్‌ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్-పాక్ మ్యాచ్.. రిజర్వ్ డే ప్రకటిస్తారా? ఇంతకంటే సిగ్గుచేటు లేదు