ఈ యేడాది భారత క్రికెట్ జట్టుకు టీ20 ఫార్మెట్ బాగా కలిసివచ్చింది. ఫలితంగా ఈ యేడాదిని టీ20 ఫార్మెట్‌ను గ్రాండ్‌గా ముగించింది. ఈ యేడాది భారత క్రికెట్ జట్టు మొత్తం 26 టీ20 మ్యాచ్‌లు ఆడగా, 24 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో మొత్తం నాలుగు టీ20 సిరీస్‌ను ఆడింది. ఈ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. తద్వారా 2024కి భారత టీ20 జట్టు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. ఈ యేడాది భారత జట్టుకు, క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఎందుకంటే 11 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్-2024ను భారత్ ముద్దాడింది. అంతేకాదు ఈ సంవత్సరం జరిగిన ఐదు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లను గెలుచుకుంది.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అభిషేక్ శర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు.
ఈ యేడాది కేవలం రెండు టీ20 మ్యాచ్ మాత్రమే భారత జట్టు ఓడిపోయింది. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే భారత్‌ను ఒక్కోసారి ఓడించాయి. ఈ యేడాది భారత్ మొత్తం 26 టీ20 మ్యాచ్‌లు ఆడగా రికార్డు స్థాయిలో 24 విజయాలు సాధించింది. ఇందులో రెండు సూపర్ ఓవర్ గెలుపులు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లను భారత్ ఓడించింది. మొత్తంగా ఈ ఏడాది అద్భుత రీతిలో విజయాలు సాధించిన టీమిండియా... పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టింది.
ఈ యేడాది టీ20 ఫార్మాట్లో భారత్ గెలుపు శాతం 92.31గా ఉంది. 2018లో పాకిస్థాన్ ఆల్-టైమ్ బెస్ట్ 89.47 శాతం కంటే ఎక్కువగా భారత్ ఏడాది విజయాల శాతం నమోదైంది. 2018లో పాకిస్థాన్ 19 టీ20 మ్యాచ్ 17 విజయాలు సాధించింది.
టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ గెలుపు శాతం..
1. భారత్ - 92.31 శాతం (26 మ్యాచ్‌ల్లో 24 విజయాలు)
2. పాకిస్థాన్ - 89.47 శాతం (19 మ్యాచ్‌ల్లో 17 గెలుపులు)
3. ఉగాండా - 87.88 శాతం (33 మ్యాచ్ ల్లో 29 విజయాలు)
4. పపువా న్యూగినియా - 87.5 శాతం (17 మ్యాచ్ ల్లో 14 విజయాలు)
5. టాంజానియా - 80.77 శాతం (29 మ్యాచ్ ల్లో 21 గెలుపులు)