నైరుతి పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన బాంబు పేలుడులో 20 మంది మరణించారు. 30 మంది గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పెషావర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బయలుదేరే క్రమంలో పేలుడు సంభవించిందని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ముహమ్మద్ బలోచ్ తెలిపారు. రైల్వే ప్లాట్‌ఫారమ్ సమీపంలో పేలుడు సంభవించింది.
సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో స్థానిక అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడుకు కారణం ఇంకా తెలియరాలేదు. అలాతే ఏ ఉగ్రవాద సంస్థా ఈ పేలుడుకు ఇంకా బాధ్యత వహించలేదు.