Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండో వన్డేలో గిల్ 200 స్కోర్ చేసి ఉండాల్సింది.. వీరేంద్ర సెహ్వాగ్

Subhman gill
, సోమవారం, 25 సెప్టెంబరు 2023 (11:53 IST)
ఆదివారం ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అద్భుతంగా ఆడిన తర్వాత శుభ్‌మాన్ గిల్ రెండో వన్డేలో డబుల్ సెంచరీ కొట్టేవాడని ఉందని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గిల్ 2023 సంవత్సరంలో తన అసాధారణ ప్రదర్శనతో అదరగొడుతున్నాడని సెహ్వాగ్ కొనియాడాడు. 
 
ఆదివారం నాటి మ్యాచ్‌లో, గిల్- శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాపై 99 పరుగుల విజయానికి పునాది వేస్తూ సెంచరీలను సాధించి, భారత్‌కు తిరుగులేని విజయాన్ని సంపాదించిపెట్టారు. గిల్ సహకారంతో 97 బంతుల్లో 104 పరుగులు చేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్ భారత్‌కు 2-0 ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని అందించింది. 
 
గిల్ ఆడిన 20 వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ, నాలుగు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలతో సహా మొత్తం 1230 పరుగులు వున్నాయి. అదే ఈ సంవత్సరంలో మరే ఇతర బ్యాటర్ కూడా 1,000 పరుగులు పూర్తి యలేదు. దీంతో ఈ విజయం మరింత ఆకట్టుకుంటుంది. 
 
ఇంకా సెహ్వాగ్ మాట్లాడుతూ... ఆదివారం నాటి మ్యాచ్‌లో గిల్ 160 లేదా 180 వంటి పెద్ద స్కోరు సాధించి ఉండాల్సిందన్నాడు.
 
"అతను మిస్ అయ్యాడు కానీ.. అతను వున్న ప్రస్తుత ఫామ్‌లో 160 లేదా 180 స్కోర్ చేసి ఉండాలని నేను ఇప్పటికీ చెబుతాను. అంతేకాకుండా రెండో వన్డే గిల్ 200 స్కోర్ చేసి ఉండాల్సిందని సెహ్వాగ్ అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం