Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరుకునేనా?

test india

ఠాగూర్

, సోమవారం, 9 డిశెంబరు 2024 (14:40 IST)
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు క్లిష్టపరిస్థితులు ఎదురవుతున్నాయి. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నీ ఫైనల్‌కు అడుగుపెట్టే అవకాశాలు క్లిష్టతరంగా మారాయి. రెండో టెస్టులో భారత్ ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 
 
ఇక ఈ ఓటమితో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కి వెళ్లేందుకు భారత జట్టు సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఆసీస్ నుంచి మొదటి స్థానానికి ఎగబాకింది. ఈ బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ ఓడినా టీమిండియా ఫైనల్ బెర్త్‌కు దారి దాదాపు మూసుకుపోయినట్లే. 
 
సో.. భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఓటమి లేకుండా ఈ సిరీస్‌ను ముగించాల్సి ఉంటుంది. ఇక ఈ మూడు మ్యాచుల్లో టీమిండియా విజయం సాధిస్తే.. ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది. 
 
ఒకవేళ రెండు మ్యాచులు గెలిచి, ఒకటి డ్రా అయినా కూడా భారత్ ఫైనల్‌తి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుతం దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఫలితంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను సౌతాఫ్రికా ఓడించాల్సి ఉంటుంది.
 
ఒకవేళ భారత్ బీజీటీలో ఒక్క మ్యాచ్ ఓడినా.. ఫైనల్ బెర్త్ కోసం దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక, ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక సిరీస్‌లో సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే పింక్ బాల్ టెస్టులో ఓటమి తర్వాత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత ఆటగాళ్లను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు.
 
ఆటగాళ్లు హోటల్ రూమ్స్ సమయం వృధా చేయకుండా ఈ రెండు రోజులను (మూడు రోజుల్లోనే రెండో టెస్టు ముగిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ..) ప్రాక్టీస్ కోసం వినియోగించుకోవాలని కోరాడు. అప్పుడే మూడో టెస్టులో భారత జట్టు పుంజుకోగలదని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Australia thrash India: భారత్ ఘోర పరాజయం.. ఆసీస్ అద్భుత రికార్డ్