Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Australia thrash India: భారత్ ఘోర పరాజయం.. ఆసీస్ అద్భుత రికార్డ్

Advertiesment
Australia

సెల్వి

, ఆదివారం, 8 డిశెంబరు 2024 (17:24 IST)
Australia
పింక్-బాల్ టెస్ట్‌లలో ఆస్ట్రేలియా అద్భుత రికార్డును సొంతం చేసుకుంది. ఆదివారం నాడు భారత్‌పై పూర్తిగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టి ప్రదర్శనతో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయింది. 
 
పింక్ బాల్ అనుభవలేమి టీమిండియా కొంపముంచింది. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలోనే లక్ష్యా చేధించి సునాయస విజయాన్నందుకుంది. అంతకుముందు 128/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ 157 పరుగుల ఆధిక్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో అధిగమించిన భారత్ 18 పరుగుల లీడ్ మాత్రమే అందుకుంది.
 
భారత రెండో ఇన్నింగ్స్ కేవలం 36.5 ఓవర్లు మాత్రమే కొనసాగింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ షార్ట్ బాల్‌ను సమర్థవంతంగా ఉపయోగించి 57 పరుగులకు 5 వికెట్లు సాధించాడు. స్కాట్ బోలాండ్ (3/51) ఆరంభంలో దెబ్బతీయగా, మిచెల్ స్టార్క్ (2/60) కీలక వికెట్లతో చెలరేగాడు. 
 
దీంతో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్( డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌లో భారత్ తమ అగ్రస్థానాన్ని కోల్పోయింది. భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెస్టుల్లో మరో రికార్డు నెలకొల్పిన జస్ప్రీత్ బుమ్రా!