Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా రికార్డులు బద్ధలు కొడతావని ఆశిస్తున్నాను... కోహ్లీ రికార్డుపై సచిన్ స్పందన

Advertiesment
sachin tendulkar
, ఆదివారం, 5 నవంబరు 2023 (22:24 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీలో వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. ఈ రికార్డు ఇప్పటివరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇపుడు దాన్ని విరాట్ కోహ్లీ సమం చేశాడు. దీనిపై సచిన్ టెండూల్కర్ స్పందించాడు. 
 
"బాగా ఆడావు విరాట్ అంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. ఇవాళ కోహ్లీ పుట్టినరోజు కూడా కావడంతో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. "నేను 49 నుంచి 50 ఏళ్ల వయసుకు చేరుకునేందుకు 365 రోజులు పట్టింది... కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకోవాలని కోరుకుంటున్నాను... తద్వారా నా రికార్డు బద్దలు కొడతావని ఆశిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
 
కాగా, భారత్ క్రికెట్ చరిత్రలో సచిన్ తర్వాత అంతటి మేటి క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు ఆదివారం కోల్‌కతా వేదికగా సమాధానం లభించింది. అంతర్జాతీయ వన్డేల్లో సచిన్ నమోదు చేసిన 49 సెంచరీల రికార్డును టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సమం చేశాడు. ఇప్పటివరకు 277 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ నేడు 49వ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్ దేవుడు సచిన్ సరసన సగర్వంగా నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహోన్నత శిఖరం చేరుకున్న విరాట్ కోహ్లీ