Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండ్-పాక్ మ్యాచ్‌కు భారీ ఏర్పాట్లు.. ప్రారంభానికి ముందు సంగీత కచ్చేరి

musical odyssey
, శుక్రవారం, 13 అక్టోబరు 2023 (09:18 IST)
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. భారత్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లను ఆడి రెండింటిలో గెలుపొందింది. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తలపడుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. పైగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ సంగీత నేపథ్య గాయకులతో మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో క్రికెట్ వర్గాలు ఈ మ్యాచ్ కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. 
 
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సుఖ్విందర్ సింగ్, శంకర్ మహదేవన్, అరిజత్ సింగ్ వంటి గాయకులతో సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అక్టోబరు 14వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంగీత కచేరీ ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ కప్ 2023: పాక్‌తో మ్యాచ్ శుభ్ మన్ గిల్‌కు విశ్రాంతి ఇస్తారా?