Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాంపియన్స్ ట్రోఫీ : గ్రూపు-బిలో ఆసక్తికరంగా మారిన సెమీస్ సమీకరణాలు!

Advertiesment
champion trophy

ఠాగూర్

, బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (12:10 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టు ఆతిథ్యమిస్తుంది. అయితే, భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూపు-బిలో సెమీస్ స్థానాలు ఆసక్తికరంగా మారాయి. ఈ గ్రూపులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. వీటిలో ఇంగ్లండ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఇంకా ఖాతా తెరవలేదు. అలాగే రావల్పిండిలో మంగళవారం ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా జట్ల జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఫలితంగా ఈ రెండు జట్లూ మూడేసి పాయింట్లతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. 
 
అయితే, మెరుగైన రన్‌రేట్ కారణంగా సఫారీ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఓటమిపాలైన ఇంగ్లండ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయినప్పటికీ అన్ని జట్లకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ముఖ్యంగా పాయింట్ల ఖాతా తెరవని ఇంగ్లండ్, ఆప్ఘనిస్థాన్ జట్లకు కూడా ఆశలు మిణుక మిణుకు మంటున్నాయి. 
 
సౌతాఫ్రికా మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మార్చి 1వ తేదీన బలమైన ఇంగ్లండ్ జట్టుతో తలపడాల్సివుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. అపుడు గెలిసిస్తే కనుక ఐదు పాయింట్లతో సెమీస్‌కు దర్జాగా చేరుకుంటుంది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా శుక్రవారం ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఇందులో ఎలాంటి సంచలనాలకు తావులేకుండా ఆస్ట్రేలియా విజయం సాధిస్తే కనుకు ఈ జట్టు ఖాతాలో కూడా ఐదు పాయింట్లు వచ్చి చేరుతాయి. అపుడు సెమీస్‌కు చేరుతుంది. లేనపక్షంలో ఆసీస్ సెమీస్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉంది. 
 
మరోవైపు, బుధవారం ఆప్ఘనిస్థాన్ జట్టుతోనూ, మార్చి ఒకటో తేదీన సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు గెలిస్తే మాత్రం ఆ జట్టుకు నాలుగు పాయింట్లు వచ్చి చేరుతాయి. ఒక్కదాంట్లో ఓడినా సెమీస్ దారులు మూసుకునిపోతాయి. 
 
ఆప్ఘనిస్థాన్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇకపై ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ సంచలన విజయాలు నమోదు చేస్తే మాత్రం సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. అయితే ఆప్ఘనిస్థాన్ ఆడాల్సిన జట్టు బలమైనవి కావడంతో అది ఎంతవరకు సాధ్యమనేది వేచి చూడాల్సిందే. మొత్తంమీద ఇప్పటివరకు ఈ నాలుగు జట్లకు సెమీస్ ఆశలు సజీవనంగానే ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ షాట్ ఆడుతూ చాలాసార్లు ఔటయ్యాను.. అదే నా వీక్నెస్ : విరాట్ కోహ్లి